వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి
KDP: సాలాబాదులో ఉపాధి హామీ పనులకు వెళ్లిన బాలరాజు రంగరాజు (70) ఇవాళ వడదెబ్బతో మృతి చెందారు. ఈ నెల 11న కాలువ పనులు చేస్తుండగా ఎండ తీవ్రతకు ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. తోటి కూలీలు వెంటనే ఆయనను కడప రిమ్స్ కు,అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రంగరాజు మరణించినట్లు ఏపీవో శివ శంకర్ రెడ్డి తెలిపారు.