రాష్ట్ర మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ

రాష్ట్ర మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ

వనపర్తి: గోపాలపేట మండల కేంద్రంలో జిల్లా సీపీఐ కార్యదర్శి రమేష్, కార్యవర్గ సభ్యుడు చంద్రయ్యతో కలిసి రాష్ట్ర మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. ఆగస్టు 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. కార్మికులు, ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.