7న ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్షలు

VSP: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం మే 7 బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఐసెట్ - 2025 నిర్వహించనున్నట్టు ఏపీ ఐసెట్ ఛైర్మన్, విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ అన్నారు. మంగళవారం పరీక్ష వివరాలను వెల్లడించారు. రెండు సెషన్లలో జరిగే ఈ పరీక్షకు 37,572 మంది హాజరవుతారు. ఉదయం 9 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుండి 4:30 వరకు పరీక్ష ఉంటుందన్నారు.