VIDEO: స్వామివారి సేవలో చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి
CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సంధర్భంగా ఆలయ ఏఈఓ రవీంద్రబాబు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శేషవస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు పాల్గొన్నారు.