హత్య రాజకీయాలను టీడీపీ ప్రోత్సహించదు

NLR: హత్య రాజకీయాలను మా ఎమ్మెల్యే మా పార్టీ ప్రోత్సహించదని టీడీపీ నాయకుడు హరికృష్ణ అన్నారు. బుచ్చిలో ఆయన మాట్లాడుతూ.. చనిపోయిన వారు చంపిన వారు గతంలో వైసీపీలో ఉన్నారని తెలిపారు.ఇరు వర్గాలు 2021లోనే వారి మధ్య గొడవ జరిగి కేసులు కూడా నమోదు చేసుకున్నారని చెప్పారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే ప్రసన్న చేపట్టిన నిరసన కార్యక్రమంలో నిందితులు కూడా ఉన్నారన్నారు.