ఏఐఎస్ఏ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ అరెస్ట్

సత్యసాయి: రొద్దం మండలంలో ఏఐఎస్ఏ జిల్లా అధ్యక్షుడు శివకుమార్‌ను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ ఆగస్టు 1న విడుదల చేసిన జీవోను తక్షణం వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో ఈరోజు పెనుకొండలో ర్యాలీకి పిలుపునిచ్చారు. ర్యాలీకి వెళ్ళనివ్వకుండా హెడ్ కానిస్టేబుల్ కాంతప్ప ముందస్తుగా ఇంటి వద్దనే హౌస్ అరెస్ట్ చేశారు.