మృతులకు AP సీఎం చంద్రబాబు సంతాపం
TG: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 'ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికుల మృతి తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను' అంటూ పేర్కొన్నారు.