VIDEO: రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 26న ర్యాలీ
NLR: రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా ర్యాలీ చేపడుతున్నట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య తెలిపారు. ఈనెల 26న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ర్యాలీ జరుగుతుందని మంగళవారం ఆయన పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.