VIDEO: అద్దంకి దత్త పాదుకా క్షేత్రంలో పంచామృతాభిషేకాలు
BPT: అద్దంకిలోని శ్రీ ధన్వంతరి దత్త పాదుకా క్షేత్రంలో శుక్రవారం ఉదయం దత్తాత్రేయ స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. మార్గశిర బహుళ అనఘాష్టమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భాస్కర ఫణి కుమార శర్మ దత్తాత్రేయునికి విశేష సుగంధ ద్రవ్యాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.