పెద్దతుంబలం నూతన ఎస్సైగా వింధ్య శ్రీ
KRNL: ఆదోని మండలం పెద్దతుంబలం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా వింధ్య శ్రీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పెద్దతుంబలం పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.