త్వరలో విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు: అశ్వినీ వైష్ణవ్
త్వరలో విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు విశాఖ రైల్వే జోన్‌పై ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇప్పటికే కార్యకలాపాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పారు. అందులో భాగంగా జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నియామకాలు పూర్తయ్యాయని వెల్లడించారు.