VIDEO: చెరువులో కాలు జారి పడ్డ వ్యక్తి మృతి ..!
SRPT: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన వెంకటేష్ చెరువులో పడి మృతి చెందాడు. పండుగకు మోతే మండలం మామిల్లగూడెం గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం చెరువు వద్ద కాలుజారి నీటిలో పడడంతో మునిగిపోగా.. స్థానికులు శనివారం చెరువులో మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.