VIDEO: యాపల్ గూడ చెరువుకు గండి

ADB: రూరల్ మండలంలో కురిసిన భారీ వర్షానికి యాపల్ గూడ చెరువుకు భారీగా గండి పడింది. దిగువ ప్రాంతాలలో ఉన్న 200 ఎకరాల పంట చేలు వరద దాటికి కొట్టుకుపోయాయి. రూరల్ మండల బీజేపీ మాజీ అధ్యక్షుడు కుంచెట్టి సంతోష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చెరువు కట్ట పనులు నాణ్యతగా చేపట్టక పోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారని తెలిపారు.