ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీనివాస రావు తెలంగాణ ఉద్యమకారుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి జీవం పోసిన మహనీయుడానీ అన్నారు. ఆయన జీవితమంతా ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రత్యేకత కోసం అహర్నిశలు పోరాడారన్నారు.