కంకటపాలెంలో రీసర్వే పనుల పరిశీలన

కంకటపాలెంలో రీసర్వే పనుల పరిశీలన

BPT: కంకటపాలెం గ్రామంలో శనివారం రీసర్వే పనులను తహసీల్దార్ సలీమా పరిశీలించారు. భూముల సరిహద్దులను కచ్చితంగా నమోదు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. రికార్డుల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. రైతులు సర్వే సమయంలో తమ భూమి వివరాలను సరిచూసుకోవాలని తహసీల్దార్ కోరారు.