'వామిట్ కామెట్స్' అంటే ఏంటో తెలుసా?

'వామిట్ కామెట్స్' అంటే ఏంటో తెలుసా?

గగన్‌యాన్ వ్యోమగాములకు ప్రత్యేకంగా మార్పులు చేసిన ఎయిర్‌బస్ ఏ330 వంటి విమానాల్లో శిక్షణ ఇస్తున్నారు. వీటిని 'వామిట్ కామెట్స్' అని పిలుస్తారు. ఇవి గాల్లో పారాబొలిక్ మార్గంలో ప్రయాణించినప్పుడు, వ్యోమగాములు ప్రతిసారి 30-40 సెకన్ల పాటు గాల్లో తేలియాడుతూ మైక్రోగ్రావిటీని అనుభవిస్తారు. 2027లో వ్యోమగాములను 400 కి.మీ ఎత్తులోని కక్ష్యలోకి పంపడమే ఇస్రో ప్రధాన లక్ష్యం.