VIDEO: సంతమాగులూరులో రోడ్డు ప్రమాదం
BPT: సంతమాగులూరు మండలం ఏల్చూరు బస్టాండ్ సెంటర్‌లో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహన చోదకుడుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.