నగరంలో లాభాలే లక్ష్యంగా కల్తీ దందా.!

నగరంలో లాభాలే లక్ష్యంగా కల్తీ దందా.!

HYD: నగరంలో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ పదార్థాల కట్టడికి పోలీసు యంత్రాంగం వరుస దాడులు నిర్వహిస్తోంది. H-FAST, టాస్క్ ఫోర్స్ పోలీసులు నెలరోజుల వ్యవధిలో నిర్వహించిన తనిఖీల్లో 15 టన్నుల కల్తీపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 61 కేసుల్లో 64 మందిని అరెస్ట్ చేసినట్లు నగర CP సజ్జనార్ నిన్న తెలిపారు. లాభాలపై ఆశతో సామాన్యుల ప్రాణాలను పణంగా పెట్టే ఏ ఒక్కరినీ వదలబోమని హెచ్చరించారు.