కుక్కల దాడిలో చిరుత మృతి
AP: కడప జిల్లా దువ్వురు మం. చిన్నబాకరావుపురంలో విషాదం చోటుచేసుకుంది. కుక్కల దాడిలో ఓ చిరుత పిల్ల ప్రాణాలు కోల్పోయింది. నీటి కోసం వచ్చి గ్రామ సమీపంలో సంచరిస్తుండగా.. గమనించిన ఊర కుక్కలు మూకుమ్మడిగా దాడిచేశాయి. చిరుత చిన్నది కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనాస్థలికి చేరుకున్న అటవీ అధికారులు.. చిరుత బాడీని స్వాధీనం చేసుకున్నారు.