శాలిబండ అగ్నిప్రమాదంపై స్పందించిన ఫైర్ డీజీ
TG: HYDలోని శాలిబండ అగ్నిప్రమాద ఘటనపై ఫైర్ డీజీ శ్రీధర్ స్పందించారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. 30 మందికి గాయాలైనట్లు తెలిపారు. CNG కారు అదుపుతప్పి ఎలక్ట్రిక్ షాపుని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఎలక్ట్రిక్ షాపు పక్కన ఉన్న క్లాత్ షాపు నుంచి మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.