VIDEO: అనంతపూర్ అడవుల్లో అరుదైన చరిత్ర
ADB: బజర్హత్నూరు మండలంలోని అనంతపూర్ అడవులకు ఓ చరిత్ర ఉంది. 1936లో జరిగిన ఓ చారిత్రక యుద్ధంలో తండ్రీకొడుకులు తలపడగా తండ్రి తల తెగి ఇక్కడే పడిపోయింది. ఆ వీరుని స్మరణార్థం ఆదివాసీలు, స్థానికులు అక్కడ రాళ్లు వేయడం ప్రారంభించారు. అది నేడు ‘ధర్మబండల’ కుప్పగా మారింది. ఏటా దసరా, పోలాల మరుసటి రోజు ‘జాగై మాతరి’ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు.