VIDEO: అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయిన కారు

VIDEO: అదుపుతప్పి కాలువలోకి దూసుకుపోయిన కారు

WGL: దేశాయిపేట సి. కేఎం కళాశాల రోడ్డు నుండి కాశిబుగ్గకు వెళ్లే దారిలో శుక్రవారం వీవర్స్ కాలనీ వద్ద కారు డ్రైనేజీలో పడిన ఘటన చోటుచేసుకుంది. అతి వేగంగా వస్తూ మలుపు వద్ద కట్ చేయడంతో కాలువలో పడింది. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా మరొకరికి స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. హైదరాబాద్‌కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు