అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి..!

అంగన్వాడీ కార్యకర్తలుగా పదోన్నతి..!

W.G: జిల్లాలో పని చేస్తున్న 70 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్ చేసినట్లు డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామ అన్నారు. ఉండి నియోజకవర్గంలో 13 మందికి పదోన్నతి లభించిందన్నారు. ఇవాళ పెద అమిరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉత్తర్వులను అందించారు. వీరికి వేతనం రూ. 7,000 నుంచి రూ. 11,500కి పెరుగుతుందన్నారు.