VIDEO: కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా.. ఒకరు మృతి
ములుగు: వాజేడు మండలం మండపాక వద్ద ఆదివారం కూలీలతో వెళ్తున్న బొలెరా ట్రాలీ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి అక్కడిక్కడే చెందగా, 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.