సీనియర్ జర్నలిస్ట్ చిట్టిబాబు మృతి
మహబూబాబాద్ జిల్లా సీనియర్ జర్నలిస్టు, ఆంధ్రప్రభ ప్రతినిధి గొర్రె చిట్టిబాబు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన ఆకస్మిక మరణం జిల్లా వ్యాప్తంగా విషాద ఛాయలు నింపింది. చిరకాలంగా జర్నలిజం రంగంలో విశేష సేవలందించిన చిట్టిబాబు మరణవార్తతో సహచరులు, స్నేహితులు దిగ్భ్రాంతికి గురయ్యారు.