వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన.. SP

BHPL: మహాముత్తారం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలను ఎస్పీ కిరణ్ ఖరే బుధవారం పరిశీలించారు. పెగడపల్లి గ్రామం సమీపంలోని పెద్దవాగు, అలుగువాగులను సందర్శించి సీఐ, ఎస్సైలకు సూచనలు ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆపద సమయంలో డయల్ 100కు కాల్ చేయాలని కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలో రెస్క్యూ టీం అందుబాటులో ఉందని తెలిపారు.