గుండెపోటుతో వ్యక్తి మృతి

ప్రకాశం: పొదిలి ఆర్టీసీ బస్టాండులో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం దర్శి మండలంలోని కట్ట సింగపాలెం గ్రామానికి చెందిన బండారు వెంకటేశ్వర్లు (65) గుండెపోటుతో ఒకసారిగా కుప్పకూలిపోయారని తెలిపారు. బస్టాండులో చాలాసేపు వేచి ఉన్నారని ఒకసారిగా గుండెపోటు రావడంతో బెంచ్ పై పడిపోయారని తెలుస్తుంది.