పింగిళి కళాశాలలో 19న స్పాట్ అడ్మిషన్లు
HNK: వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ-పీజీ కళాశాలలో పీజీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 19న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఎంఏ (తెలుగు, ఇంగ్లీష్), ఎమ్మెస్సీ (జువాలజీ, బాటనీ, కంప్యూటర్ సైన్స్) కోర్సులకు అభ్యర్థులు సీపీజీఈటీ-2025 అర్హతతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని హాజరు కావాలని ప్రిన్సిపల్ చంద్రమౌళి ఇవాళ కోరారు.