గుండెపోటుతో ఉద్యోగిని మృతి

గుండెపోటుతో ఉద్యోగిని మృతి

W.G: ఉండి మండలం మహాదేవపట్నం-1 సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మంతెన నాగ ప్రశాంతి శుక్రవారం రాత్రి తీవ్ర గుండెపోటుతో మరణించారు. ఆమెకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. గతంలో వాండ్రం సచివాలయంలో పనిచేసిన ఆమె మృతి పట్ల సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.