'ఐక్యతే అభివృద్ధికి మూలం'

'ఐక్యతే అభివృద్ధికి మూలం'

SRD: ఐక్యతే అభివృద్ధికి మూలమని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. పోతిరెడ్డిపల్లిలో ఆదివారం నిర్వహించిన వీరశైవ లింగాయత్ సమాజ సమావేశానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. వీరశైవ లింగాయత్ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సమాజ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.