బీటీ రోడ్డు కోసం నేటి నుంచి రిలే దీక్షలు
NGKL: బల్మూర్ మండల కేంద్రం నుంచి మహాదేవపూర్ గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నట్లు పార్టీ మండల కార్యదర్శి శంకర్ నాయక్ తెలిపారు. రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.