VIDEO: కుక్కదాడిలో ఆరుగురికి గాయాలు
KMR: దోమకొండలో వీధి కుక్కల బెడద పెరిగి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం కపిల్ గణపతి ప్రాంతంలో కుక్క ఆరుగురిపై దాడి చేయడంతో వారు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక చిన్నారికి కూడా ఉంది. స్థానికులు వెంటనే బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల స్వైర విహారం పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.