50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌కు భూమి పూజ

అన్నమయ్య: రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గురువారం 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌కు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కలిసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం రెండు నూతన అంబులెన్సులను ప్రారంభించి, రోగులకు అవసరమైన మందులు అందేలా డాక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.