జైశంకర్‌పై పాక్ అక్కసు
కేంద్రమంత్రి జైశంకర్‌పై పాక్ మరోసారి అక్కసు వెళ్లగక్కింది. పాక్ సైన్యంతోనే భారత్‌కు ఎక్కువ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని జైశంకర్ అనడం సరికాదని పేర్కొంది. తమ వ్యవస్థలను, నాయకత్వాన్ని కించపరిచేలా కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పింది. సైన్యం సహా వ్యవస్థలన్నీ తమ జాతీయ భద్రతకు మూలస్తంభాలని తెలిపింది.