VIDEO: సమయపాలన పాటించని అంగన్వాడీ టీచర్
KMM: కూసుమంచి మండలం సీత్లీతండా గ్రామంలోని అంగన్వాడీ టీచర్ ధరావత్ భద్రమ్మ సమయపాలన పాటించడం లేదని స్థానికులు తెలిపారు. మధ్యాహ్నం కాగానే పాఠశాలకు తాళం వేసి పిల్లలను వదిలేసి వెళ్ళిపోతుందని, పలుసార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమయపాలన పాటించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని వాపోయారు.