యోగాసనాలతో సంపూర్ణ ఆరోగ్యం: కామేశ్వర్ రెడ్డి

యోగాసనాలతో సంపూర్ణ ఆరోగ్యం: కామేశ్వర్ రెడ్డి

SKLM: యోగాసనాలతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని, కంచిలి మండలం అర్జునాపురం ప్రభుత్వ ఎంపీపీ పాఠశాల ఉపాధ్యాయులు బుడ్డెపు కామేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక పాఠశాలలో విద్యార్థులకు యోగాసనాలు వేయించారు. దీనివలన శారీరక, మానసిక ఉల్లాసం లభిస్తుందని, కొన్ని రకాల వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. విద్యార్థి దశ నుంచే యోగాసనాలపై అవగాహన అవసరమని సూచించారు.