పైపల్లిలో ట్రాక్టర్ దొంగతనం

పైపల్లిలో ట్రాక్టర్ దొంగతనం

CTR: తవణంపల్లి మండలం పైపల్లి గ్రామానికి చెందిన హేమంత్ కుమార్ ట్రాక్టర్‌ను దుండగులు దొంగిలించినట్లు SI చిరంజీవి చెప్పారు. ఈ నెల 16న బాధితుడు పొలం పనులు ముగించుకుని షెడ్‌లో ట్రాక్టర్‌ను ఉంచాడు. మరుసటి రోజు చూడగా అక్కడ ట్రాక్టర్ లేదు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.