ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేదలకు వరం: ఎమ్మెల్యే
శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొండు శంకర్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. గొంటి వీధిలో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేశారు.ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని తెలిపారు.