'హెల్మెట్ తప్పనిసరి ధరించాలి'

'హెల్మెట్ తప్పనిసరి ధరించాలి'

మహబూబాబాద్: జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం పంచాయతీ 'నో హెల్మెట్ - నో ఎంట్రీ' నిబంధనను అమలులోకి తెచ్చింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేనివారికి గ్రామంలోకి ప్రవేశం లేదని గ్రామ శివార్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్పష్టం చేశారు. గ్రామస్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పాలకవర్గం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు దక్కుతున్నాయి.