సత్తెనపల్లిలో యువకుడి ఆత్మహత్య

PLD: సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన పాలేటి మహేశ్ (32) మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన బంధువులు, స్నేహితులు అతడిని సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేశ్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి వద్ద సూసైడ్ నోట్ లభించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.