ఆర్ఎంసీలో సెక్యూరిటీ గార్డుల నిరసన

ఆర్ఎంసీలో సెక్యూరిటీ గార్డుల నిరసన

KKD: కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల సెక్యూరిటీ గార్డులు రెండు నెలల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంట్రాక్టర్ మొండి వైఖరి వీడి వేతనాలు ఇవ్వాలని, ప్రిన్సిపల్ స్పందించి సమస్యను పరిష్కరించాలని తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.