ప్రజావాణిలో 23 ఫిర్యాదులు స్వీకరణ

NZB: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పీ. సాయి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి 23 అర్జీలను స్వీకరించి, వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని కోరారు.