VIDEO: ఆంజనేయస్వామి ఆలయంలో చోరీ

NTR: కంచికచర్ల మండలం పరిటాల ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దొంగలు ఉత్తర ద్వారం పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించి, స్వామివారి కిరీటం, మకర తోరణంతో పాటు మరికొన్ని వెండి, బంగారు వస్తువులను దొంగిలించినట్లు సమాచారం. ఈ ఘటనపై క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.