ధాన్యం, పత్తి తడవకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
NGKL: జిల్లాలో ఈనెల 2, 3 తేదీలలో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరి ధాన్యం, పత్తి తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.