పోలాకిలో రాత్రి వేళ రక్త సేకరణ

పోలాకిలో రాత్రి వేళ రక్త సేకరణ

SKLM: పోలాకి ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం ఫైలేరియా సర్వే నిర్వహించారు. గ్రామంలో 302 మంది నుంచి రాత్రి సమయంలో రక్త నమూనాలు సేకరించారు. ఈ పరీక్షల ద్వారా ఫైలేరియా కారక క్రిమిని గుర్తించవచ్చని వైద్యులు తెలిపారు. ఫైలేరియా లేని సమాజమే లక్ష్యంగా గుర్తింపు, నివారణ చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.