ఎయిడెడ్ టీచర్లు ఇంతమంది ఖాళీగా ఉన్నారు?

ప్రకాశం: జీవో నంబర్-1 ప్రకారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 205 మంది ఎయిడెడ్ టీచర్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కాగా వీరందరిని ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయటం లేదు. విద్యాశాఖ వీరిని ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్షులు కోరుతున్నారు.