VIDEO: డంపింగ్ యార్డ్‌ను సందర్శించిన డైరెక్టర్

VIDEO: డంపింగ్ యార్డ్‌ను సందర్శించిన డైరెక్టర్

కృష్ణా: గుడివాడ డంపింగ్ యార్డ్‌ను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బోలెం నాగమణి సోమవారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులపై సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. డంపింగ్ యార్డ్‌లో జరుగుతున్న శుభ్రత, వ్యర్థాల నిర్వహణ పనులను పరిశీలించారు. పనులను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ, పరిసర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆమె సూచించారు.