సౌత్ జోన్ అండర్ -14కు ఉమేశ్ ఎంపిక

సౌత్ జోన్ అండర్ -14కు ఉమేశ్ ఎంపిక

KMM: బోనకల్ మండలం ఆళ్లపాడు గ్రామానికి చెందిన తోటకూర ఉమేశ్ ప్రతిష్ఠాత్మక సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ అండర్-14 బాలుర క్రికెట్ టోర్నమెంటుకు ఎంపికయ్యాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్‌గా స్థిరమైన ప్రదర్శనలతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న ఉమేశ్ ఎంపిక గ్రామానికి గర్వకారణమైంది.