VIDEO: బరాఖాత్ గూడెం వేంకటేశ్వర ఆలయంలో కలశ ప్రతిష్ఠ

VIDEO: బరాఖాత్ గూడెం వేంకటేశ్వర ఆలయంలో కలశ ప్రతిష్ఠ

SRPT: మునగాల (మం) బరాకతూడెంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ రాజగోపుర కలశ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామస్థులు జల బిందెల కార్యక్రమం అనంతరం ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రతిష్ట మహోత్సవం నేపథ్యంలో దేవాలయ ప్రాంగణం అంతా భక్తిభావంతో మార్మోగింది.