వారిది సిమెంట్ కంటే దృఢమైన బంధం: బాల్క సుమన్

వారిది సిమెంట్ కంటే దృఢమైన బంధం: బాల్క సుమన్

MNCL: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డిలపై BRS నాయకుడు బాల్క సుమన్ సెటైర్లు వేశారు. వారిద్దరూ పెద్దమ్మ, చిన్నమ్మల కొడుకుల్లా ఉంటారని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ సీఎంకు దొరకని అపాయింట్‌మెంట్ రేవంత్ రెడ్డికి దొరుకుతుందన్నారు. రామ్ కో సిమెంట్ కంటే దృఢమైన బంధం కిషన్, రేవంత్ రెడ్డిలదని ఎద్దేవా చేశారు.